Police: రెండేళ్ల నాటి హిట్ అండ్ రన్ కేసును రీఓపెన్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు... మాజీ ఎమ్మెల్యేకు షాక్
- ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ గల కారు ఢీకొని బాలుడి మృతి
- స్టిక్కర్ తన స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పిన మాజీ ఎమ్మెల్యే షకీల్
- ఈ ప్రమాదానికి సంబంధించి కారు డ్రైవర్, మరో వ్యక్తిపై ఛార్జిషీట్
- ఈ కేసును మళ్లీ ఓపెన్ చేసిన పోలీసులు
మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. హిట్ అండ్ రన్ కేసును తిరిగి ఓపెన్ చేశారు. రెండేళ్ల క్రితం... 17 మార్చి 2022న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాలుడిని ఢీకొట్టిన కారు షకీల్‌కు చెందినదిగా ఆరోపణలు వచ్చాయి. ఈ కారు మీరా ఇన్ఫ్రా పేరుతో రిజిస్టర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే షకీల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లుగా కూడా అప్పుడు గుర్తించారు. అయితే ఆ స్టిక్కర్ వున్న కారు తనది కాదని... తన స్టిక్కర్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు షకీల్ అప్పుడు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జిషీట్ వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ కేసును రీఓపెన్ చేశారు.