Tamilisai Soundararajan: తెలంగాణను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది... మిమ్మల్ని ఎప్పటికీ మరువను: తమిళిసై

Tamilisai responds her resignation
  • ఎప్పటికీ తెలంగాణ వారికి సోదరినే అని వ్యాఖ్య
  • తాను ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నానని వెల్లడి
  • తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తమిళిసై
'నేను ఎప్పటికీ మీ సోదరినే...  తెలంగాణను వదిలి వెళుతున్నందుకు చాలా బాధగా ఉంది... ఈ ప్రాంత ప్రజలను ఎన్నటికీ మరువ'నని తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన అంశంపై ఆమె తాజాగా స్పందించారు. తాను ప్రజాసేవ కోసం తిరిగి వెళుతున్నానన్నారు. తనపై చూపిన ప్రేమాభిమానాలకు తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకి బయలుదేరారు.

లోక్ సభ ఎన్నికలలో ఆమె బీజేపీ తరఫున తమిళనాడులో బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టకముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2019 సెప్టెంబర్ నుంచి తెలంగాణ గవర్నర్‌గా ఉన్నారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ఈ రెండింటికి రాజీనామా చేశారు.
Tamilisai Soundararajan
BJP
Telangana
Tamil Nadu

More Telugu News