Chandrababu: స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ

Hearing in Supreme Court on Chandrababu Bail cancelation petition

  • స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
  • అధికారులను, దర్యాప్తు సంస్థను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ప్రభుత్వం పిటిషన్
  • ప్రభుత్వ ఆరోపణలకు సమాధానాలు ఇస్తామన్న చంద్రబాబు తరపు న్యాయవాది

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేతకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని... రెడ్ బుక్ పేరుతో ఒక డైరీ పెట్టి అందులో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నామని బెదిరింపులకు దిగుతోందని పిటిషన్ లో వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను ఈరోజు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం విచారించనుంది. 

ప్రభుత్వం పేర్కొన్న ఆరోపణలపై తాము సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్టు చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్ సాల్వే గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలను వినిపిస్తూ... చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకున్నాయని... అధికారులను, దర్యాప్తు సంస్థను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని చెప్పారు. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, మూడు వారాలకు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఈనాటి విచారణ సందర్భంగా కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News