hra: ఉద్యోగులకు హెచ్ఆర్ఏను సవరించిన టీఎస్ఆర్టీసీ

  • జీవో నెంబర్ 53 ప్రకారం సవరణ చేయాలని 2020లో ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశం
  • అప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల పే-రివిజన్ చేయకపోవడంతో హెచ్‌ఆర్‌ఏ సవరణ తాత్కాలిక నిలిపివేత
  • ఇటీవల 2017 పే-స్కేల్‌ని రివిజన్ చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు హెచ్ఆర్ఏను ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. జీవో నెంబర్ 53 ప్రకారం హెచ్ఆర్ఏ సవరణ చేయాలని 2020లో ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల పే-రివిజన్ చేయకపోవడంతో హెచ్‌ఆర్‌ఏ సవరణను ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల 2017 పే-స్కేల్‌ని రివిజన్ చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జీవో నంబర్ 53 ప్రకారం... ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏపై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News