UPSC: సివిల్స్-2024 ప్రిలిమ్స్ తేదీ మార్చిన యూపీఎస్సీ

UPSC changes exam date for Civils prelims and Forest Services Screening Test
  • మే 26న సివిల్స్, ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమ్స్ నిర్వహించాలని భావించిన యూపీఎస్సీ
  • ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • ఆ రెండు పరీక్షల తేదీని జూన్ 16కు మార్చిన యూపీఎస్సీ
ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్, ఫారెస్ట్ సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ మే 26న జరగాల్సి ఉండగా, యూపీఎస్సీ ఆ పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది. ఆ రెండు పరీక్షలను జూన్ 16న నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. లోక్ సభ ఎన్నికల కారణంగానే ప్రిలిమ్స్ తేదీ మార్చినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్ ప్రిలిమ్స్, ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగ  నియామకాల కోసం యూపీఎస్సీ గతంలో విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. సివిల్స్ లో 1,056 ఉద్యోగాలు, ఫారెస్ట్ విభాగంలో 150 పోస్టుల భర్తీ చేయనున్నారు. వీటికి దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 6తో ముగిసింది.
UPSC
Civils Prelims
Forest Services
Exam
India

More Telugu News