UPSC: బీ అలెర్ట్.. యూపీఎస్సీ పరీక్షల తేదీ మారింది!
- సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీఎస్సీ నిర్ణయం
- మే 26న జరగాల్సిన పరీక్షలను జూన్ 16కు మార్చిన బోర్డు
- సెప్టెంబరులో మెయిన్స్
త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల తేదీ మారింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌తోపాటు ఇతర సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు నిర్వహించే ఈ పరీక్ష ముందు పేర్కొన్న ప్రకారం మే 26న జరగాల్సి ఉంది.
అయితే, ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ రావడం, పలు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో పరీక్షల తేదీని మే 26 నుంచి జూన్ 16కు మార్చినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో పాసైన వారు సెప్టెంబరులో జరిగే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు.