Chandrababu: జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: చంద్రబాబు
- ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు పలికిన జేపీ
- హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
- ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వెల్లడి
- భావసారూప్యత ఉన్నవారందరూ కలిసి రావాలని విజ్ఞప్తి
ఏపీ ఎన్నికల్లో తాము టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు పలుకుతున్నామని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు.
ప్రగతిశీల, ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలన్న జయప్రకాశ్ నారాయణ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భావసారూప్యత కలిగిన అందరు వ్యక్తులు, సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.