Rajinikanth: ఇలా అన్నానని.. నాకూ, కమల్‌కూ విభేదాలున్నాయని రాసేయొద్దు: రజనీకాంత్

Rajnikanth attends hospital opening ceremony in Chennai
  • చెన్నైలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న రజనీకాంత్
  • కావేరీ ఆసుపత్రి పాప్యులారిటీ పెరిగిందని వెల్లడి
  • ప్రస్తుతం కమల్ ఇల్లు కావేరీ ఆసుపత్రి పక్కన ఉందని అంటున్నారని వ్యాఖ్య
ఎన్నికల సమయంలో తనకు ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తోందని స్టార్ హీరో రజనీకాంత్ సరదా కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

‘‘గతంలో కావేరీ ఆసుపత్రి ఎక్కడ అని ఎవరినైనా అడిగితే, కమల్‌ హాసన్ వాళ్ల ఇంటి దగ్గర అని చెప్పేవాళ్లు. ఇప్పుడు కమల్ హాసన్ వాళ్ల ఇల్లు కావేరీ ఆసుపత్రి దగ్గర అని చెబుతున్నారు. ఇది సాధారణంగా చెబుతున్నానంతే.. మళ్లీ నాకూ, కమల్‌కు విభేదాలున్నాయని రాయకండి. మీడియా వాళ్లు ఉంటే మాట్లాడాలంటే సంకోచిస్తున్నాను. ఈ కెమెరాలన్నీ చూస్తుంటే భయమేస్తోంది. అసలే ఎన్నికల సమయం. నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను’’ అని సరదా కామెంట్స్ చేశారు. గతంలో తాను అనేక ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నట్టు చెప్పిన రజనీ..వారి వల్లే తాను ఇప్పుడిలా హాయిగా ఉన్నట్టు తెలిపారు.
Rajinikanth
Kamal Haasan
Chennai
Tamilnadu

More Telugu News