Keshav Maharaj: అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
- అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న కేశవ్ మహారాజ్
- తొలిసారి ఐపీఎల్ బరిలోకి దక్షిణాఫ్రికా క్రికెటర్
- ఈ ప్రొటీస్ క్రికెటర్‌ను వేలం రూ.50లక్షల కనీస ధరకు దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్
- ఈ నెల 24న రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో తొలి మ్యాచ్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాడు. గతేడాది దుబాయి వేదికగా జరిగిన మినీ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్‌ను రూ.50లక్షల కనీస ధరకు దక్కించుకుంది. దీంతో ఇప్పటికే లక్నో జట్టుతో అతడు కలిశాడు. ప్రస్తుతం ఎల్ఎస్‌జీ లక్నోలోని ఏక్నాస్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో కేశవ్ మహారాజ్ గురువారం అయోధ్య రామమందిరాన్ని సందర్శించాడు.
మందిరంలో బాల రాముడిని దర్శించుకున్నాడు. ఆ సమయంలో తీసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ రామభక్తుడు. అందుకే ఇవాళ ప్రత్యేకంగా అయోధ్య రాముడిని దర్శించుకోవడం జరిగింది. కాగా, ఈ 17వ సీజన్‌లో ఎల్ఎస్‌జీ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 24వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.