Roja: మంత్రి రోజా జీవితంపై పుస్తకం విడుదల

Book on Roja biography released
  • 'రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి' పేరుతో రోజా బయోగ్రఫీ
  • పుస్తకాన్ని ఆవిష్కరించిన అంబటి, భూమన
  • కార్యక్రమానికి హాజరైన రోజా భర్త సెల్వమణి
ఏపీ మంత్రి రోజా జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన రోజా చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం, చాలా ఏళ్ల పాటు అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి... టీడీపీలో కీలక బాధ్యతలను నిర్వహించడం, అనంతరం వైసీపీలోకి చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రి పదవిని చేపట్టడం జరిగాయి. రాజకీయాల్లో ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. తన పార్టీని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా సహించలేని తత్వం ఆమెది. ఈ లక్షణాలన్నీ ఆమెను ఒక ప్రత్యేకమైన లీడర్ గా నిలిపాయి. 

మరోవైపు ఆమె జీవితంపై పుస్తకం విడుదలయింది. 'రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి' పేరుతో పబ్లిష్ అయిన ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోజా భర్త ఆర్కే సెల్వమణితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
Roja
Biography
Book
YSRCP

More Telugu News