Mukesh Ambani: రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో ఎవరు ఏ పదవిలో.. పూర్తి వివరాలు ఇవిగో!
- రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ స్థాపించిన దివంగత ధీరూభాయ్ అంబానీ
- 1985లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌గా మార్పు
- ఆర్ఐఎల్‌కు చైర్మన్‌గా, ఎండీగా ముఖేశ్ అంబానీ
- రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్‌గా అనిల్ అంబానీ
భారత బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుటుంబమంతా రిలయన్స్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. దివంగత ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ స్థాపించారు. 1985లో అది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌గా మారింది. ధీరూభాయ్ అంబానీ మృతి తర్వాత రిలయన్స్ వ్వాపార సామ్రాజ్య విభజన జరిగింది. రియలన్స్ ఇండస్ట్రీస్ కు ముఖేశ్ అంబానీ ప్రస్తుతం సారథ్యం వహిస్తున్నారు. రిలయన్స్ గ్రూప్ అనిల్ అంబానీ చేతుల్లోకి వెళ్లింది. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఎవరు ఏయే పదవులు నిర్వర్తిస్తున్నారో చూద్దాం.
ముఖేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు ముఖేశ్ అంబానీ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలో ఇదే అతిపెద్ద ప్రైవేటు రంగ సంస్థ. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ 114 బిలియన్ డార్లు. ( 95,29,69,89,00,000)
నీతా అంబానీ
ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను స్థాపించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గానూ ఆమె వ్యవహరిస్తున్నారు.
ఇషా అంబానీ
ముఖేశ్ అంబానీ-నీతా అంబానీ దంపతుల ఏకైక కుమార్తె ఇషా అంబానీ. ఆర్ఐఎల్ బోర్డ్ డైరెక్టర్లలో ఆమె కూడా ఒకరు. రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనూ ఆమె భాగస్వామి.
ఆకాశ్ అంబానీ
ముఖేశ్-నీతా అంబానీ దంపతుల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 2022 నుంచి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
అనంత్ అంబానీ
ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ప్రస్తుతం ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. రాధిక మర్చంట్‌తో ఇటీవల గుజరాత్‌లో జరిగిన ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగవైభవంగా సాగాయి. ప్రపంచంలోని ప్రముఖులందరూ ఈ వేడుకలకు హాజరయ్యారు. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్‌లోనూ ఆయన సభ్యుడు.
అనిల్ అంబానీ
ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ (రిలయన్స్ ఏడీఏ గ్రూప్) చైర్మన్‌గా ఉన్నారు. ఈ గ్రూప్‌లో రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కేపిటల్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్, రిలయన్స్ డిఫెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.
జై అన్మోల్ అంబానీ
అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీ రిలయన్స్ కేపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, రిలయన్స్ ఇన్‌ఫ్రా డైరెక్టర్‌గా ఉన్నారు.