P.Gannavaram: పి.గన్నవరం నుంచి జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్... మహాసేన రాజేశ్ సీటు గల్లంతు!
- పి.గన్నవరం, పోలవరం అభ్యర్థులను ప్రకటించిన పవన్
- గిడ్డి సత్యనారాయణకు గన్నవరం టికెట్
- పోలవరం నుంచి బరిలో దిగుతున్న బాలరాజు
- ఇద్దరికీ నియామక పత్రాలు అందించిన పవన్
- పి.గన్నవరం టికెట్ ను తొలుత మహాసేన రాజేశ్ కు కేటాయించిన టీడీపీ
- ఇప్పుడా స్థానం జనసేనకు బదలాయింపు
ఏపీలో టీడీపీ, బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇటీవలే పలువురి అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు.
పి.గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని గిడ్డి సత్యనారాయణకు, పోలవరం స్థానాన్ని బాలరాజుకు కేటాయించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్... సత్యనారాయణ, బాలరాజులకు నియామక పత్రాలు అందించారు.
వాస్తవానికి పి.గన్నవరం సీటును తొలుత టీడీపీ కోటాలో మహాసేన రాజేశ్ కు కేటాయించారు. ఇప్పుడదే సీటును జనసేనకు బదలాయించారు. జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. మహాసేన రాజేశ్ పరిస్థితి ఏంటన్నదానిపై అనిశ్చితి నెలకొంది.