Daggubati Purandeswari: సాక్షి యాజమాన్యానికి పరువునష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి

Purandeswari sent defamation notice to Sakshi media management

  • విశాఖ తీరంలో డ్రగ్స్ కంటైనర్ కలకలం
  • సంధ్యా ఎక్స్ పోర్ట్స్ తో తమకు సంబంధం లేదన్న పురందేశ్వరి
  • సాక్షి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం 
  • రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్టు ప్రకటన

విశాఖ తీరంలో డ్రగ్స్ అలజడి వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. సంధ్యా ఎక్స్ పోర్ట్స్ సంస్థలో తాము భాగస్వాములమంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ సాక్షి మీడియాపై మండిపడ్డారు. 

ఈ క్రమంలో, తన పరువుకు భంగం కలిగించారంటూ పురందేశ్వరి సాక్షి మీడియాకు పరువునష్టం నోటీసులు పంపించారు. రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్టు తెలిపారు. ఆధార రహిత వార్తలు ప్రచారం చేస్తూ పరువునష్టం కలిగిస్తున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరి న్యాయవాది సతీశ్ ఈ మేరకు సాక్షి యాజమాన్యానికి నోటీసులు పంపారు. 

విశాఖ తీరానికి ఇటీవల బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ రాగా, అందులో 25 వేల కిలోల నిషిద్ధ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ డ్రగ్స్ తెప్పించిన కంపెనీ మీ వాళ్లదేనంటూ ఏపీ రాజకీయ పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News