YS Avinash Reddy: వైసీపీలో చేరిన 2 వేల టీడీపీ కుటుంబాలు.. ప్రతి రోజు చేరికలు ఉంటాయన్న వైఎస్ అవినాశ్ రెడ్డి

From today onwards there will be joinings in to YSRCP says Avinash Reddy
  • వేంపల్లిలో సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు
  • కార్యక్రమంలో పాల్గొన్న అవినాశ్ రెడ్డి
  • పార్టీలోకి వచ్చే వారికి వైఎస్సార్ కుటుంబం స్వాగతం పలుకుతుందన్న అవినాశ్
కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరారు. వైసీపీ నేత సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 2 వేల కుటుంబాలు చేరాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. వీరందరికీ అవినాశ్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ... ఈరోజు నుంచి ప్రతిరోజు వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి చేరికలు ఉంటాయని తెలిపారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ కుటుంబం స్వాగతం పలుకుతుందని చెప్పారు. 

రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని అవినాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ నెల 27న ఇడుపులపాయలో ప్రారంభమయ్యే 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
YS Avinash Reddy
Jagan
YSRCP
Pulivendula

More Telugu News