Stellantis: ఒక్క ఫోన్ కాల్‌తో 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన స్టెల్లాంటిస్

Stellantis layoffs fired 400 employees on call

  • ఇండియా, మెక్సికో, బ్రెజిల్ నుంచి చవకగా ఔట్ సోర్సింగ్ సేవలు
  • వారిని ప్రోత్సహిస్తూ రెగ్యులర్ ఉద్యోగుల్లో కోత
  • తొలగించిన వారికి పరిహార ప్యాకేజీ ఇస్తున్నట్టు ప్రకటన

ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ ఒక్క ఫోన్ కాల్‌తో అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ డివిజన్‌లోని 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది. ఫార్చ్యూన్ మేగజైన్ కథనం ప్రకారం.. ఈ నెల 22న రిమోట్ కాల్ చేసి ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇస్తున్నట్టు ప్రకటించింది. 

ఈ కంపెనీకి ఇండియా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. వారు సమర్థవంతంగా, తక్కువ వేతనాలకే పనిచేస్తుండడంతో వారిని ప్రోత్సహిస్తూ, రెగ్యులర్ ఉద్యోగులను తొలగించింది. అయితే, తొలగించిన ఉద్యోగులను ఉత్త చేతులతో పంపడం లేదని, పరిహార ప్యాకేజీ చెల్లిస్తున్నట్టు తెలిపింది. ఆటో ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 

2022లో ట్విట్టర్ లేఆఫ్‌లతో ప్రారంభమైన తీసివేతల పర్వం ఆ తర్వాత ప్రముఖ టెక్ కంపెనీలకు పాకింది. దీంతో వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇప్పుడిప్పుడే మళ్లీ స్థిమితపడుతున్న తరుణంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి మళ్లీ తీసివేతలపై కంపెనీలు దృష్టిసారించాయి.

  • Loading...

More Telugu News