Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత
- ముంబయి ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ
- సింగిల్ టీమ్ తరఫున 200 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఇప్పటిదాకా ధోనీ, కోహ్లీ సొంతం
- ఈ జాబితాలో మూడో ఆటగాడిగా రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ఐపీఎల్ లో అరుదైన ఘనత అందుకున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్ లలో బరిలో దిగిన ఆటగాడిగా రికార్డు పుటల్లో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా, ఐపీఎల్ లో ఓ జట్టు తరఫున 200 మ్యాచ్ లు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచాడు.
రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఘనతను ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సాధించారు. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ 200 మ్యాచ్ లు ఆడగా, కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 200 మ్యాచ్ లు ఆడాడు. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో రోహిత్ కూడా ధోనీ, కోహ్లీ సరసన చేరాడు.
మొత్తమ్మీద రోహిత్ శర్మకు ఇది 245వ ఐపీఎల్ మ్యాచ్. రోహిత్ శర్మ గతంలో డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీకి ఆడిన సంగతి తెలిసిందే.