Dhananjaya Yeshwant Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
- హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమాలో భేటీ అయిన రేవంత్
- అనంతరం మర్యాదపూర్వక భేటీ
- రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవన నిర్మాణ పనులకు జస్టిస్ చంద్రచూడ్ శంకుస్థాపన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమాలో ఉన్న ఆయనను కలిసిన రేవంత్‌రెడ్డి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజేంద్రనగర్‌లో వంద ఎకరాల్లో నిర్మించనున్న నూతన హైకోర్టుకు సంబంధించి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నట్టు తెలిసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో వంద ఎకరాల్లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు నిర్మాణ పనులకు జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్వీ భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో 32 జిల్లా కోర్టులకు ఈ-సేవా కేంద్రాలను ఆన్లైన్ ద్వారా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించారు.