Rajastan Royals: ఔటైన కోపంలో బ్యాట్‌ను కర్టెయిన్‌కేసి కొట్టిన రిషబ్ పంత్.. వైరల్ వీడియో ఇదిగో

Rishabh Pant slams his bat into curtains in frustration after getting out in IPL 2024 clash vs Rajastan Royals
  • తీవ్ర అసహనంతో పెవిలియన్‌కు వెళ్లిన పంత్
  • 26 బంతుల్లో 28 పరుగులే చేయడంతో కోపంతో కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్
  • రాజస్థాన్ రాయల్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైన పంత్ సేన
గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకమైన దశలో ఔట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 26 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 28 పరుగులే చేశాడు. దీంతో తీవ్ర అసహనంతో పెవిలియన్‌కు వెళ్తూ తన బ్యాట్‌ను కర్టెయిన్‌కేసి (పరదాలకు) కొట్టాడు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కడంతో వీడియో వైరల్‌గా మారింది. 

కాగా ఔట్ అయ్యే సమయానికే పంత్ విసుగుచెందినట్టు కనిపించాడు. వేగంగా పరుగులు రాబట్టాల్సిన సమయంలో కూడా తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడడం అతడి అసహనానికి కారణమయ్యింది. క్రీజులో ఎక్కువ సమయమే గడిపినప్పటికీ భారీ షాట్లు కొట్టడంతో విఫలమయ్యాడు. మరోవైపు వేగంగా ఆడుతున్న దశలో డేవిడ్ వార్నర్ కూడా ఔట్‌ కావడం పంత్‌పై ఒత్తిడి పెంచింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు 81 పరుగులు అవసరమైన దశలో స్పిన్నర్ చాహల్‌ బౌలింగ్‌లో పంత్ ఔట్ అయ్యాడు.
Rajastan Royals
Delhi Capitals
Rishab pant
Cricket
IPL 2024

More Telugu News