Kevin Pietersen: లండన్ మేయర్‌పై మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్ర విమర్శలు
- లండన్‌లోని ప్రస్తుత దారుణ పరిస్థితులపై మాజీ క్రికెటర్ ట్వీట్
- లండన్‌లో చేతికి ఖరీదైన గడియారం పెట్టుకోలేం.. చేతిలో ఫోన్‌తో నడవలేమన్న పీటర్సన్
- కార్లను ధ్వంసం చేసి లూటీలు చేస్తున్నారని ఆవేదన
- మేయర్ సాదిక్ ఖాన్ తాను సృష్టించిన దానిపట్ల గర్వంగా ఉన్నారేమోనని చురకలు
లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్ర విమర్శలు చేశాడు. దేశ రాజధాని లండన్ ఎంతో అద్భుతమైన నగరమని పీటర్సన్ పేర్కొన్నాడు. కానీ, లండన్‌లో ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో నగర మేయర్‌పై 'ఎక్స్' (ట్విటర్) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించాడు.
"లండన్‌లో చేతికి ఖరీదైన గడియారం పెట్టుకోలేం. చేతిలో మొబైల్ ఫోన్‌తో నడవలేం. మహిళల ఆభరణాలు, బ్యాగుల్ని కూడా దొంగిలిస్తున్నారు. కార్లను ధ్వంసం చేసి లూటీలు చేస్తున్నారు. మేయర్ సాదిక్ ఖాన్ తాను సృష్టించిన దానిపట్ల గర్వంగా ఉన్నారేమో" అని పీటర్సన్ ట్వీట్ చేశాడు. కాగా, ఇస్లామిక్ దేశాల నుంచి భారీగా శరణార్థుల్ని లండన్‌కు రప్పించారన్న ఆరోపణలను ఇప్పటికే మేయర్ సాదిక్ ఖాన్ ఎదుర్కొంటున్నారు.