Kadiam Srihari: కాంగ్రెస్ నేతలు మా ఇంటికి వచ్చి ఆహ్వానించారు... ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తా: కడియం శ్రీహరి
- తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కోరినట్లు వెల్లడి
- శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్న కడియం శ్రీహరి
- వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందని వ్యాఖ్య
కాంగ్రెస్ నేతలు ఇంటికి వచ్చి తనను పార్టీలోకి ఆహ్వానించారని, ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు తనను కలిశారని చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వారు కోరినట్లు చెప్పారు. తన శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందన్నారు.
కడియం ఇంటికి కాంగ్రెస్ నేతలు
కడియం శ్రీహరి ఇంటికి శుక్రవారం మధ్యాహ్నం పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఇంటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై వారు చర్చించారు.