David Warner: అల్లు అర్జున్ ‘లెజెండ్’.. ప్రశంసల జల్లు కురిపించిన డేవిడ్ వార్నర్

David Warner congratulates Allu Arjun after wax statue unveiled in Dubai
  • దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్ స్పందన
  • కంగ్రాట్స్ పుష్ప అంటూ అభినందనలు
  • వార్నర్ పోస్టుపై స్పందించి ‘థ్యాంక్స్ బ్రదర్ ’ అని చెప్పిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో ఆవిష్కరించడంపై ఆస్ట్రేలియా క్రికెటర్‌, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. అల్లు అర్జున్‌ను లెజెండ్‌గా అభివర్ణిస్తూ అభినందనలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ... ‘‘లెజెండ్ అల్లు అర్జున్ ఎంత చక్కగా ఉన్నాడు. కంగ్రాట్స్ పుష్ప’’ అని రాసుకొచ్చాడు. అల్లు అర్జున్ తన మైనపు విగ్రహం పక్కన నిలబడి దిగిన ఫొటోను వార్నర్ షేర్ చేశాడు. ఈ పోస్టుపై స్పందించిన అల్లు అర్జున్.. ‘‘'థాంక్యూ మై బ్రదర్’’ అని కామెంట్ చేశాడు.

కాగా డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న సమయంలో విడుదలైన ‘పుష్ప’తో ఐకాన్ స్టార్‌కి ఫ్యాన్‌గా మారిపోయాడు. ఐపీఎల్‌లోనే కాదు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా పుష్ప సినిమా పాటలకు మైదానంలోనే స్టెప్పులు వేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన తర్వాత పుష్ప పాప్యులర్ స్టైల్ ‘తగ్గేదేలా’ అని పోజు ఇచ్చాడు. ఇక ఫీల్డింగ్ సమయంలో ‘శ్రీవల్లి’ పాటలోని స్టెప్ వేశాడు. అంతేకాదు అల్లు అర్జున్ పాటలకు డ్యాన్స్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చాలా వీడియోలు అప్‌లోడ్ చేశాడు. తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కూడా కొన్ని స్టెప్స్ వేయించిన వీడియోలు ఉన్నాయి. అంతేకాదు.. గతంలో ఐకాన్ స్టార్ బర్త్‌డేకి పిల్లలతో రీల్స్ రూపంలో విషెస్ కూడా చెప్పించాడు. 

కాగా పుష్ప 2 సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందుకోసం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. మరోవైపు డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు.
David Warner
Allu Arjun
wax statue
Dubai
Tollywood
Cricket

More Telugu News