GHMC Staff Attacked: జీహెచ్ఎంసీ కార్మికులపై రాళ్ల దాడి.. వీడియో ఇదిగో!

Street Vendors Attacked On GHMC Staff At Rajendranagar

  • ఫుట్ పాత్ పై పెట్టిన కొబ్బరి బొండాల బండి తొలగింపుపై వివాదం
  • వీడియో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది
  • వ్యాపారితో పాటు నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

ఫుట్ పాత్ పై కొబ్బరి బొండాలు అమ్మొద్దని, ఫుట్ పాత్ ఖాళీ చేయాలని చెప్పిన జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఓ వ్యాపారి రాళ్లతో దాడి చేశాడు. ఇటుకలతో జీహెచ్ఎంసీ సిబ్బందిని కొడుతూ హంగామా సృష్టించాడు. వ్యాపారితో పాటు మరో ముగ్గురు కుర్రాళ్లు కూడా దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుందీ ఘటన. ఇదంతా జీహెచ్ఎంసీ సిబ్బంది ఒకరు వీడియో తీసి పోలీసులకు అందజేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కొబ్బరి బొండాల వ్యాపారితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

విధుల్లో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం ఉదయం రాజేంద్రనగర్ లోని సులేమాన్ నగర్ లో క్లీనింగ్‌కు వెళ్లారు. రహదారి పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై ఉన్న చిరు వ్యాపారులను ఖాళీ చేయించారు. ఈ క్రమంలోనే ఓ కొబ్బరి బొండాల వ్యాపారి జీహెచ్ఎంసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఖాళీ చేయాలని చెప్పినా వినకపోవడంతో కొబ్బరి బొండాల బండిని, కొబ్బరి బొండాలను ట్రాక్టర్ లో తరలించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో సహనం కోల్పోయిన సదరు వ్యాపారి రాళ్లు, ఇటుకలతో జీహెచ్ఎంసీ సిబ్బందిపై దాడి చేశాడు. జీహెచ్ఎంసీ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News