Election Commission: ఏపీలో పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించిన ఈసీ
- హైకోర్టు ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ వెల్లడి
- నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని సూచన
- వాలంటీర్ల ట్యాబ్, మొబైల్ లను కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశాలు
ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ ముకేశ్ కుమార్‌మీనా వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నన్ని రోజులు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్ లను కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని సూచించారు. కాగా, మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని 'సిటిజన్ ఫర్ డెమోక్రసీ' (సీఎఫ్‌డీ) నగదు పంపిణీలో ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సీఎఫ్‌డీ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు ముకేశ్ కుమార్‌మీనా తెలిపారు.