Vevekam Movie: వైఎస్ వివేకా బయోపిక్ 'వివేకం' సినిమాను ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

Dasthagiri filed petition in High Court to stop Vivekam movie

  • ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న 'వివేకం' చిత్రం
  • వైఎస్ వివేకా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా
  • తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉండటంపై దస్తగిరి అభ్యంతరం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం. గత ఎన్నికల్లో ఈ హత్యను వైసీపీ ఒక ప్రచారాస్త్రంగా కూడా ఉపయోగించుకుంది. మరోవైపు, వివేకా జీవిత చరిత్రతో తెరకెక్కిన 'వివేకం' సినిమా యూట్యూబ్ లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తొలిరోజులోనే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించి సత్తా చాటింది. ఈ చిత్రంలో వివేకాను జగన్, భారతి, అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు టార్గెట్ చేయడం, ఆయనను అత్యంత కిరాతకంగా హతమార్చడం వంటి సన్నివేశాలు ఉన్నాయి.  

మరోవైపు ఈ చిత్రంపై వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉండటంపై హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో ఉన్న నేపథ్యంలో, సినిమా ప్రదర్శనను ఆపేయాలని కోర్టును కోరారు. టీడీపీ డిజిటల్ విభాగం ఐటీడీపీ ప్రోత్సాహంతో ఈ సినిమా అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఈ సినిమాను ప్రదర్శిస్తోందని తెలిపారు. ఈ పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News