IPL 2024: ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కి ఊహించ‌ని షాక్‌.. కెప్టెన్ రిషభ్ పంత్‌కు భారీ జ‌రిమానా!

Delhi Capitals skipper Rishabh Pant penalized for slow over rate during win over CSK

  • రిషభ్ పంత్‌కు రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా
  • స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగానే ఫైన్ వేసిన‌ట్లు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ వెల్ల‌డి
  • నిన్న వైజాగ్‌ వేదిక‌గా సీఎస్‌కే, డీసీ మ‌ధ్య‌ మ్యాచ్‌
  • 20 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) సార‌ధి రిష‌భ్ పంత్‌కు భారీ జ‌రిమానా ప‌డింది. ఆదివారం విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-బీడీసీఏ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ అత‌డికి రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. "మినిమమ్ ఓవర్ రేట్‌కు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించడం జ‌రిగింది" అని ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ త‌న‌ ప్రకటనలో పేర్కొంది. 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే 20 పరుగుల తేడాతో డీసీ విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్ రెండు వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత రిష‌భ్ పంత్ సేన తొలి విక్ట‌రీ సాధించింది. డేవిడ్ వార్న‌ర్‌, పంత్ అర్ధ శ‌త‌కాల‌తో ఆక‌ట్టుకోగా.. పేసర్లు ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ అద్భుతమైన స్పెల్‌లతో సీఎస్‌కేను క‌ట్టడి చేయ‌డంతో 20 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో పంత్ నేతృత్వంలోని ఢిల్లీ ఫ్రాంచైజీ ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని రుచి చూసింది. అటు డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్‌కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలో మొదటి ఓటమిని చవిచూసింది.

  • Loading...

More Telugu News