Stock Market: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని లాభాల్లో ప్రారంభించిన మార్కెట్లు

Markets ends in profits

  • 363 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 135 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 9 శాతం లాభపడ్డ జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరాన్ని మార్కెట్లు లాభాల్లో ప్రారంభించాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్లు లాభపడి 74,014కి చేరుకుంది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 22,464 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (4.81%), టాటా స్టీల్ (4.62%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.38%), ఎన్టీపీసీ (1.88%), ఎల్ అండ్ టీ (1.66%). 

టాప్ లూజర్స్:
టైటాన్ (-1.76%), నెస్లే ఇండియా (-1.43%), భారతి ఎయిర్ టెల్ (-0.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.77%), టెక్ మహీంద్రా (-0.45%).

  • Loading...

More Telugu News