KTR Fires On Modi: క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ రేట్లు తగ్గించట్లేదేం?: మోదీని నిలదీసిన కేటీఆర్

Every Indian needs to think about this Asks KTR

  • ప్రతీ భారతీయుడూ దీనిపై ఆలోచించాలని కోరిన మాజీ మంత్రి
  • 2014 నుంచి ఇప్పటి వరకు క్రూడాయిల్ ధర 20 డాలర్లు తగ్గిందని వివరణ
  • కొండెక్కిన పెట్రోల్ రేటు మాత్రం కొంచెం కూడా తగ్గలేదని మండిపాటు
  • గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ పడిపోతే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారని, ఆ పాపమంతా కేంద్రానిదేనని ట్వీట్ చేశారని గుర్తుచేశారు. అప్పట్లో మోదీ చేసిన ట్వీట్లను కేటీఆర్ రీట్వీట్ చేశారు. మరి ఇప్పుడు.. గత పదేళ్లుగా ప్రధాని సీట్లో కూర్చుని మోదీ చేసిందేంటని నిలదీశారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉండె.. ఇప్పుడు ఎలా ఉన్నాయంటూ రేట్ల పట్టికను ట్వీట్‌ చేశారు. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండేవని, మోదీ పదేళ్ల పాలనలో నేడు చమురు ధరలు దిగొచ్చినా సరే కొండెక్కిన పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం అలానే ఉన్నాయని ఆరోపించారు.

గడిచిన దశాబ్దంలో పెట్రోల్ ధర రూ.35, డీజిల్ ధర రూ.40 వరకు పెరిగిందని చెబుతూ దీనికి బాధ్యులెవరని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. నిత్యావసర ధరలు పెరగడానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటూ నిలదీశారు. 2014 ఏప్రిల్ 2న పెట్రోల్ ధర రూ.72.26, డీజిల్ ధర రూ.55.49, క్రూడ్ ఆయిల్ ధర 105.56 డాలర్లు ఉండేవని, ప్రస్తుతం 2024 ఏప్రిల్ 2న పెట్రోల్ ధర రూ.107.41, డీజిల్ ధర రూ.95.65, క్రూడ్ ఆయిల్ ధర 86.44 డాలర్లు ఉందని కేటీఆర్ చెప్పారు. ఇక, గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పట్లో మోదీ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ.. రూపాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందని, రూపాయి విలువ పడిపోవడానికి కేంద్ర ప్రభుత్వ అవినీతే కారణమని మోదీ చెప్పారన్నారు.


  • Loading...

More Telugu News