Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

Delhi HC reserves verdict on Kejriwal plea

  • తన అరెస్ట్‌ను హైకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్
  • కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ
  • ఈడీ తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం కేసులోని మనీలాండరింగ్ అంశంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ పిటిషన్‌పై జస్టిస్ స్వరణకాంత శర్మ వాదనలు విన్నారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునే ఉద్దేశ్యంతో ఈ అరెస్ట్ జరిగిందని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ ఆధారాలు చూపలేకపోయిందని వివరించారు.

ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కుంభకోణం జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌గా, వ్యక్తిగతంగా ఆయన పాత్ర ఉందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

  • Loading...

More Telugu News