Gang Rape Rurvivorr: లైంగికదాడి బాధితురాలిని కోర్టు హాలులోనే దుస్తులు విప్పమన్న మేజిస్ట్రేట్
- దళిత యువతిపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం
- గాయాలు చూపించమన్న మేజిస్ట్రేట్
- నిరాకరించి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
అత్యాచార బాధిత యువతి (18)ని దుస్తులు విప్పి గాయాలు చూపించాలని ఆదేశించిన రాజస్థాన్‌లోని కరౌలి జిల్లా మేజిస్ట్రేట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 30న బాధిత దళిత యువతి ఫిర్యాదు మేరకు హిందౌన్ కోర్టు మేజిస్ట్రేట్‌పై కేసు నమోదు చేసినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్సీ-ఎస్టీ) సెల్ మినా మీనా తెలిపారు.
బాధిత యువతి దుస్తులు విప్పేందుకు నిరాకరించిందని, వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత మేజిస్ట్రేట్‌పై ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు మేజిస్ట్రేట్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైనట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజస్థాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ సింగ్ జాట్ నేతృత్వంలోని బృందానికి కేసును బదిలీ చేసినట్టు పేర్కొన్నారు. వాంగ్మూలం నమోదు చేసేందుకు నిన్న అజయ్‌సింగ్ బాధిత బాలికను కలిశారు. కాగా, బాధిత యువతిపై మార్చి 19న ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.