Stephen Ravindra: స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్ రెడ్డికి డీఎస్పీ ఫిర్యాదు
- నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూవివాదంలో జోక్యం చేసుకున్నానని రవీంద్ర తనను సస్పెండ్ చేశారన్న డీఎస్పీ
- భూకబ్జాదారులతో చేయి కలిపి, ఎలాంటి విచారణ చేయకుండానే తనను సస్పెండ్ చేసినట్లు ఆరోపణ
- దీంతో తాను పదోన్నతి అవకాశం కోల్పోయానని ఆవేదన
- పదోన్నతికి అవకాశం పరిశీలించాలని కోర్టు ఆదేశించినా న్యాయస్థానం ఉత్తర్వులను రవీంద్ర లెక్క చేయలేదని ఫిర్యాదు
సైబరాబాద్ మాజీ సీపీ, ప్రస్తుత హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. తాను నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూవివాదంలో జోక్యం చేసుకున్నానని ఆరోపిస్తూ రవీంద్ర తనను సస్పెండ్ చేశారని తెలిపారు. భూకబ్జాదారులతో చేయి కలిపి, ఎలాంటి విచారణ చేయకుండానే తనను సస్పెండ్ చేసినట్లు ఆరోపించారు. దీంతో తాను పదోన్నతి అవకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
పదోన్నతికి అవకాశం పరిశీలించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ న్యాయస్థానం ఉత్తర్వులను స్టీఫెన్ రవీంద్ర లెక్క చేయలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పలువురు కిందిస్థాయి అధికారులను ఆయన ఇబ్బంది పెట్టారంటూ ఫిర్యాదు కాఫీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హోంశాఖ, డీవోపీటీకి పంపించారు.