K Kavitha: ఢిల్లీ మద్యం కేసులో ప్రణాళికలు రచించింది కవితే: ఈడీ

ED alleges Kavitha for Delhi Liquor scam

  • కవిత తన ఫోన్ డేటాను డిలీట్ చేశారన్న ఈడీ
  • విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదన్న ఈడీ
  • కవిత నుంచి 10 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, అన్నీ ఫార్మాట్ చేసిందని వెల్లడి

ఢిల్లీ మద్యం కేసులో కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. అసలు మద్యం పాలసీ కుంభకోణానికి కవితనే ప్రణాళికలు రచించారని పేర్కొంది. కవిత తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని పేర్కొంది. ఆమెను పది రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించామని, కానీ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదన్నారు.

కవిత నుంచి 10 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వాటన్నింటినీ ఫార్మాట్ చేసి ఇచ్చారని ఈడీ పేర్కొంది. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని తెలిపింది. నిందితులకు చెందిన వందలకొద్ది డిజిటల్ డివైజ్‌లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.

  • Loading...

More Telugu News