Dr Suneetha Reddy: జగన్ జైల్లో ఉంటే షర్మిల పార్టీని బతికించింది... కానీ...!: సునీతా రెడ్డి

Sunitha Reddy campaigns for YS Sharmila

  • కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిల
  • షర్మిలతో పాటు ప్రచారంలో పాల్గొన్న వివేకా కుమార్తె సునీతా రెడ్డి
  • జగన్ కు షర్మిలను చూస్తే భయం పట్టుకుందని వ్యాఖ్యలు
  • హంతకులకు శిక్ష పడాలంటే వాళ్లు అధికారంలో ఉండరాదన్న సునీతారెడ్డి
  • అవినాశ్ రెడ్డిని ఓడించి షర్మిలను గెలిపించాలని పిలుపు

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ కడప జిల్లా నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సునీతా రెడ్డి ప్రసంగిస్తూ, వివేకాను కిరాతకంగా హత్య చేశారని, ఆయనను చంపించింది అవినాశ్ రెడ్డి అని ఆరోపించారు. హత్య చేయించిన వ్యక్తి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నాడని అన్నారు. 

"జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పార్టీని బతికించింది. కానీ జగన్ జైలు నుంచి వచ్చాక షర్మిలను పక్కనపెట్టారు. జగన్ కు షర్మిలను చూస్తే భయం పట్టుకుంది. రాజకీయంలో జగన్ కంటే షర్మిల ముందున్నారు. వైఎస్సార్ లో ఉన్న ప్రతి లక్షణం షర్మిలలో ఉంది. జగన్ హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వివేకా హంతకులకు శిక్ష పడాలి. శిక్ష పడాలంటే హంతకులు అధికారంలో ఉండకూడదు. హంతకులను గద్దె దించే సమయం వచ్చింది. అవినాశ్ రెడ్డిని ఓడించాలి... షర్మిలను గెలిపించాలి" అని సునీతారెడ్డి పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News