Kangana Ranaut: ‘బీఫ్’ ఆరోపణలను ఖండించిన బీజేపీ నేత కంగనా రనౌత్

BJP Leader Kangana Rejects Beef Consuming Allegations
  • కంగన బీఫ్ తిన్నారంటూ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
  • తానెప్పుడూ బీఫ్ తినలేదని వివరణ
  • తాను హిందువునని గర్విస్తున్నట్టు వెల్లడి
  • తనపై జరిగే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్న కంగన
తాను బీఫ్ తిన్నానంటూ కాంగ్రెస్ నేత చేసిన ఆరోపణలను బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి పోటీచేస్తున్న కంగనా రనౌత్ తీవ్రంగా ఖండించారు. తాను హిందువునని గర్విస్తున్నట్టు చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు.

 తాను బీఫ్ కానీ, మరేవిధమైన రెడ్‌మీట్ కానీ ఎప్పుడూ తినలేదని ఎక్స్ ద్వారా కంగన తెలిపారు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం గురించి ప్రచారం చేస్తున్నానని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసే ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని తేల్చి చెప్పారు. ప్రజలకు తానేంటో తెలుసని, తాను గర్వించదగిన హిందువునని, కాబట్టి తన గురించి ప్రజలను తప్పుదోవ పట్టించలేరని పేర్కొన్న ఆమె.. ‘జైశ్రీరామ్’ అని ముగించారు.
Kangana Ranaut
BJP
Himachal Pradesh
Mandi
Beef
Proud Hindu

More Telugu News