SIT: తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాల దహనంపై విచారణకు సీపీఐ డిమాండ్
- సిట్ కార్యాలయంలో పత్రాల దహనం
- చంద్రబాబు కేసులకు సంబంధించిన పత్రాలు అంటూ టీడీపీ ఫైర్
- సీఐడీ చీఫ్ ఆదేశాలతోనే పత్రాలు తగలబెట్టినట్టుందని సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించిన పత్రాలను సిట్ కార్యాలయంలో దహనం చేశారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలను కూడా టీడీపీ పంచుకుంది. ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాలు దహనం చేయడంపై విచారణ జరపాలని సీపీఐ డిమాండ్ చేసింది.
సీఐడీ చీఫ్ ఆదేశాలతోనే పత్రాలు తగలబెట్టినట్టు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మాదిరిగా ఏపీలో సిట్ అక్రమ కేసు వ్యవహారం సాగిందని ఆరోపించారు. హెరిటేజ్ సంస్థ పత్రాల దహనం వెనుక అంతర్యం ఏమిటని రామకృష్ణ నిలదీశారు. సీఐడీ అక్రమాలు వెలుగులోకి వస్తాయనే దహనం చేశారా? అని ప్రశ్నించారు.