K Kavitha: కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించిన కోర్టు
- కవిత రిమాండ్ ను 14 రోజులు పొడిగించిన కోర్టు
- ఏప్రిల్ 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు
- మార్చి 26 నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. కవిత రిమాండ్ ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో కవిత ఈ నెల 23 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను నిన్న కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.