Committee Kurrollu: నిహారిక సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’... టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సాయి దుర్గా తేజ్

Niharika presents Committee Kurrollu movie and Sai Durga Tej launches title poster
  • 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లతో కమిటీ కుర్రోళ్లు
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న యదు వంశీ
  • అందరూ కొత్త వాళ్లతో ఈ చిత్రం చేశామన్న నిహారిక
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ... ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు. ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశాం. పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ , శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. అలాంటి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే.  యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు. 

కాగా, ఈ చిత్రంలో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 

కమిటీ కుర్రోళ్లు చిత్రంలో... సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేశ్, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి నటిస్తున్నారు. 

సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీలక్ష్మి ,కంచరపాలెం కిశోర్, కిట్టయ్య, రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తిపండు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.
Committee Kurrollu
Niharika
Title Poster
Sai Durga Tej
Yadu Vamsi
Tollywood

More Telugu News