Danam Nagender: దానం నాగేందర్ అనర్హత వేటు అంశంపై హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్
- అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన దానం
- సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్
- సభాపతికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- ఆయన స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దానంపై చర్యలు తీసుకోవాలని ఇదివరకే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ నుంచి స్పందన రాలేదని చెబుతూ హైకోర్టును ఆశ్రయించింది.
దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని బీఆర్ఎస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో దానంపై త్వరగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోర్టును బీఆర్ఎస్ కోరింది.