IMD: తిరిగొస్తున్న లానినా.. ఈసారి ముందస్తుగానే రుతుపవనాలు.. ఫుల్లుగా వర్షాలు!
- హిందూ మహాసముద్రంలో ఏకకాలంలో క్రియాశీలం అవుతున్న ఐడీవో-లానినా
- సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం
- రుతుపవనాలు స్థిరమైన పంథాను అనుసరించే అవకాశం ఉందన్న ఐఎండీ
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈసారి వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటూ చల్లని ప్రకటన చేసింది. ఎల్‌నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి లానినా పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిందూ మహాసముద్ర ద్విధ్రువ (ఐడీవో) పరిస్థితులతోపాటు లానినా పరిస్థితులు ఏకకాలంలో యాక్టివ్ అవుతుండడంతో ఈసారి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
రుతుపవనాల అల్పపీడనాలు పశ్చిమ-వాయవ్య భారతదేశం, ఉత్తర అరేబియా సముద్రంవైపు విస్తరించి స్థిరమైన పంథాను అనుసరిస్తాయని భావిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని ఐడీఎం పేర్కొంది. అంతేకాదు, సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.