K Kavitha: ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
- మద్యం కేసులో విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకున్న సీబీఐ
- జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవిత
- జైల్లో కవితను విచారించనున్న సీబీఐ
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. ఆమె ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పుడు సీబీఐ ఆమెను తీహార్ జైల్లోనే ప్రశ్నించనుంది.
సీబీఐ గత ఏడాది హైదరాబాద్లోని ఆమె నివాసంలో విచారించింది. ఆమెను మరోసారి విచారించేందుకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో ఆమెను ఈరోజు కస్టడీలోకి తీసుకుంది. కవితను పది రోజుల పాటు తమ కస్టడీకి కోరే యోచనలో సీబీఐ ఉంది. కాగా, కవిత రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 16న కోర్టులో విచారణ జరగనుంది.