Karachi: రంజాన్ మాసంలో కరాచీకి పోటెత్తిన 4 లక్షల మంది యాచకులు

Pakistan Port City Karachi Flouting With 4 Lakh Beggars In Ramadan Month

  • సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్ సహా దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన బిచ్చగాళ్లు
  • వారి రాకతో అమాంతం పెరిగిన దొంగతనాలు
  • సీసీ కెమెరాలుంటే తప్ప దొంగలను పట్టుకోవడం సాధ్యం కాదన్న ఏడీజీ

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో పాకిస్థాన్ పోర్టు సిటీ కరాచీ బిచ్చగాళ్లతో పోటెత్తింది. దేశం నలుమూలల నుంచి దాదాపు 4 లక్షల మంది నగరానికి చేరుకున్నారు. సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్ సహా దేశంలోని నలుమూలల నుంచి బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో తరలివచ్చినట్టు కరాచీ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ తెలిపారు. 

యాచకులు నగరానికి పోటెత్తడంతో నేరాలు అమాంతం పెరిగినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలో నేరస్థులను పట్టుకోవడం అసాధ్యమని భావించి ప్రతి కూడలిలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News