K Kavitha: కవితకు మూడ్రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

Court granted three day custody for kavitha

  • ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలకమని కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్న సీబీఐ
  • ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ
  • రేపటి నుంచి మూడురోజుల కస్టడీ 

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ఐదు రోజుల కస్టడీని కోరగా... మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించనుంది.

కవిత కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు

మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ... అందులో కీలక అంశాలు పేర్కొంది. కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. మద్యం కేసులో కవిత చాలా కీలకమని, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చెల్లించారని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు ఇచ్చారని తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు అందులో పేర్కొంది. సీబీఐ 11 పేజీలతో ఈ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News