YS Jagan: ఈ నెల 25న నామినేషన్ వేయనున్న సీఎం జగన్
- సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు
- ఈ నెల 24న శ్రీకాకుళం నుంచి నేరుగా పులివెందుల చేరుకోనున్న సీఎం జగన్
- పులివెందులలో నామినేషన్ అనంతరం సభకు హాజరు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం బహిరంగలో పాల్గొంటారు.
కాగా, ఈ నెల 22న సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఇది ముందు జాగ్రత్త కోసమేనని తెలుస్తోంది.
జగన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డిపై 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపొందారు. అంతకుముందు, 2014లోనూ సతీశ్ కుమార్ పై జగన్ విజయం సాధించారు. ఈసారి పులివెందులలో సీఎం జగన్ కు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు.