Vishal: వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థంపై హీరో విశాల్ స్పందన

Hero Vishal responds on Varalaxmi Sarathkumar being entered into marital life
  • నికోలాయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం
  • వరలక్ష్మి వివాహ బంధంలో అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్న విశాల్
  • గతంలో విశాల్, వరలక్ష్మి మధ్య ప్రేమాయణం అంటూ ప్రచారం
గతంలో హీరో విశాల్, నటి వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం నడిచిందని అనేక కథనాలు వచ్చాయి. వీరిద్దరూ పందెం కోడి-2 చిత్రంలో నటించగా, ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ... వీళ్లిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. విశాల్, వరలక్ష్మి చిన్ననాటి స్నేహితులు. 

ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఘనంగా జరిగింది. దీనిపై విశాల్ స్పందించారు. వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నందుకు తాను సంతోషిస్తున్నానని తెలిపారు. ఆమె కెరీర్ లో ఎదగాలన్న లక్ష్యాన్ని అందుకుందని, తెలుగులో ఎంతో గుర్తింపు సాధించిందని, అందుకు ఆనందిస్తున్నానని పేర్కొన్నారు.
Vishal
Varalaxmi Sarathkumar
Engagement
Nicholai Sachdev

More Telugu News