Stock Market: స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే
- 456 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 124 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3.65 శాతం నష్టపోయిన ఇన్ఫోసిన్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీగా నష్టపోయాయి. ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు కోల్పోయి 72,943కి పడిపోయింది. నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 22,147 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్, టెలికాం, బ్యాంకెక్స్, మెటల్, రియాల్టీ కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (1.26%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.20%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.97%), మారుతి (0.62%), ఐటీసీ (0.18%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-3.65%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.12%), విప్రో (-2.32%), బజాజ్ ఫైనాన్స్ (-2.31%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.94%).