ECI: ఏపీలో మరో ఉన్నతాధికారిని బదిలీ చేసిన ఎన్నికల సంఘం

EC transfers another official in AP
  • ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు
  • మార్చి 16 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్
  • ఇప్పటికే పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లపై ఈసీ బదిలీ వేటు
  • తాజాగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి స్థానచలనం
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళి నేపథ్యంలో, ఇప్పటికే పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం... తాజాగా మరో ఉన్నతాధికారిని బదిలీ చేసింది. 

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. 

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నూతన ఎండీ నియామకం కోసం ముగ్గురి పేర్లను సిఫారసు చేయాలని రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఇవాళ రాత్రి 8 గంటల్లోపు ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది.
ECI
Andhra Pradesh
Elections

More Telugu News