Encounter: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 29కి పెరిగిన మృతుల సంఖ్య... మృతులలో మావోయిస్టు కీలక నేతలు!
- కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
- కల్పర్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్స్ కు మధ్య కాల్పులు
- మృతుల్లో డివిజనల్ కమిటీ మెంబర్లు శంకర్ రావు, లలిత
ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్ జిల్లా చోటేబైథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడి కల్పర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నక్సల్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కాల్పుల్లో మృతి చెందిన నక్సల్స్ సంఖ్య 29కి పెరిగింది. ఘటన స్థలంలో ఒక ఏకే-47 తుపాకీ, మూడు లైట్ మెషీన్ గన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మరణించిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు శంకర్ రావు, లలిత ఉన్నట్టు గుర్తించారు. శంకర్ రావు తలపై రూ.25 లక్షల రివార్డు ఉంది. శంకర్ రావు, లలిత మావోయిస్టు పార్టీలో నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్లు అని తెలుస్తోంది.