Amit Shah: మావోయిస్టులను వదిలిపెట్టం.. సమూలంగా తుడిచిపెడతాం: అమిత్ షా

We will clean maoists says Amit Shah

  • ఛత్తీస్ గఢ్ లో 250 పోలీస్ క్యాంప్ లను ఏర్పాటు చేశామన్న అమిత్ షా
  • ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 మంది నక్సలైట్లు చనిపోయారని వెల్లడి
  • మావోల ప్రాబల్యం భారీగా తగ్గుతోందన్న కేంద్ర హోం మంత్రి

మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. మావోలను ఏరిపారేయడానికి కేంద్రం ఏకంగా బీఎస్ఎఫ్ బలగాలను కూడా బరిలోకి దింపింది. ఈ మధ్య కాలంలో ఛత్తీగఢ్ లో భారీ సంఖ్యలో మావోలను హతమార్చారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో ఏకంగా 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... నక్సలిజంతో పాటు టెర్రరిజంను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు క్యాంపులను భారీగా పెంచామని చెప్పారు. 2019 నుంచి వీటి ఏర్పాటును మరింత ముమ్మరం చేశామని తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోనే 250 క్యాంపులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 80 మంది నక్సలైట్లు చనిపోయారని, 125 మంది అరెస్ట్ అయ్యారని, 150 మంది లొంగిపోయారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ప్రాబల్యం భారీగా తగ్గుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News