Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ ఖరారు.. రామరాజుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు!

Undi TDP ticket almost confirmed for Raghu Rama Krishna Raju

  • రఘురాజుకు ఉండి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం
  • మాడుగులలో బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ దక్కే అవకాశం
  • దెందులూరు స్థానాన్ని బీజేపీకి ఇచ్చే ప్రతిపాదనలు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రఘురాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. నామినేషన్ల పర్వం నిన్ననే ప్రారంభమయింది. రఘురాజుకు నేరుగా ఉండి నియోజకవర్గం బీఫామ్ ను అందించే అవకాశం ఉంది. 

మరోవైపు మాడుగులలో పైలా ప్రసాద్ ను మార్చి... ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మడకశిరలో అనిల్ కుమార్ కు బదులు ఎమ్మెస్ రాజును బరిలోకి దించొచ్చని చెపుతున్నారు. తంబళ్లపల్లెలో జైచంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సరళారెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు అనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు టికెట్ బీజేపీకి ఇచ్చేలా ప్రతిపాదనలు ఉన్నాయి. దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తో పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతోంది.

  • Loading...

More Telugu News