IPL 2024: ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరాలంటే ఏకైక సమీకరణం ఇదే!
- మిగిలిన 7 మ్యాచ్‌ల్లో గెలిస్తే ఆర్సీబీ ఖాతాలో 16 పాయింట్లు
- గతంలో పలు సీజన్లలో కనీస అర్హతగా ఉన్న 8 విజయాలు
- 16 పాయింట్లతో ఇతర జట్లు కూడా పోటీపడితే కీలకం కానున్న నెట్ రన్ రేట్
ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 6 పరాజయాలు చవిచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయా? అంటే క్రికెట్ నిపుణులు ఏకైక సమీకరణం చెబుతున్నారు. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ తమకు సెమీ ఫైనల్ లాంటిదని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ చెప్పినట్టుగా ఆ జట్టు ఆడబోయే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఆర్సీబీ చేతిలో ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉండగా అన్నింటిలోనూ విజయం సాధిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం దక్కవచ్చు.
గతంలో పలు ఐపీఎల్ సీజన్లలో 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు కనిష్ఠంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ 16 పాయింట్లు పొంది... పాయింట్ల పట్టికలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జట్లు కూడా 16 పాయింట్లతోనే ఉంటే అప్పుడు నెట్ రన్ రేట్ అత్యంత కీలకంగా మారనుంది. 2011, 2012, 2013, 2022, 2023 ఐపీఎల్ సీజన్లలో ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి 16 పాయింట్లు కనిష్టంగా ఉన్నాయి. కాబట్టి ఆర్సీబీ తన చేతిలో మిగతా 7 మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఇదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి ఇతర జట్లు కూడా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లలో ఓడిపోతే ఆర్సీబీకి సానుకూలంగా మారుతుంది.
ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌లు..
1. ఏప్రిల్ 21న కోల్‌కతాతో
2. ఏప్రిల్ 25న సన్‌రైజర్స్‌తో
3. ఏప్రిల్ 28న గుజరాత్‌తో
4. మే 4న గుజరాత్‌తో
5. మే 9న పంజాబ్‌తో
6. మే 12న ఢిల్లీ క్యాపిటల్స్‌తో
7. మే 18న సీఎస్కేతో