K Kavitha: కవితకు మరోసారి షాక్.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా!
- సీబీఐ అరెస్టుపై కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పు మే 2కు వాయిదా
- ఈడీ అరెస్టుపై ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణ
- సీబీఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠ
సీబీఐ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు వాయిదా వేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. సీబీఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రెండు బెయిల్ పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.